: రజనీని ఎందుకు బాధ్యుడ్ని చేస్తున్నారు?: నడిగర సంఘం
లింగా సినిమా కొనుగోలు వల్ల వచ్చిన నష్టాలకు సూపర్ స్టార్ రజనీకాంత్ ను ఎందుకు బాధ్యుడిని చేస్తున్నారని నడిగర సంఘం ప్రశ్నించింది. సినిమాకు వచ్చిన నష్టాల విషయంలో నిర్మాతను అడగాలి కానీ, హీరోను అడగడం ఎందుకని నడిగర సంఘ నాయకులు ప్రశ్నించారు. కేవలం రజనీకాంత్ దృష్టిని ఆకర్షించాలనే డిస్ట్రిబ్యూటర్లు నిరాహార దీక్షలకు దిగుతున్నారని వారు ఆరోపించారు. ఏదైనా సినిమా జయాపజయాలు ప్రేక్షకుల చేతుల్లోనే ఉంటాయని, ఇతర వ్యాపారాల్లాగే సినీ నిర్మాణంలో కూడా లాభనష్టాలు ఉంటాయని వారు స్పష్టం చేశారు. లింగా సినిమాతో లాభాలార్జిస్తామని భావించిన డిస్ట్రిబ్యూటర్లు, నష్టాలు వచ్చాయంటూ రజనీని కలవడం సరికాదని నడిగర సంఘం సూచించింది. నష్టపరిహారం కావాలంటే వెళ్లి నిర్మాతను అడగాలని సంఘం తెలిపింది. నష్టపరిహారం న్యాయమైతే దానిని తదుపరి ప్రాజెక్టులో సర్దుబాట్లు చేసుకోవాలని సంఘం సూచించింది.