: మీ మద్దతెవడిక్కావాలి?: కాంగ్రెస్ ఆఫర్ ను తిరస్కరించిన ఆప్


ఢిల్లీని పొగమంచు, చలి వణికిస్తుండగా, రాజకీయాలు అక్కడి వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. ఢిల్లీలో ఎన్నికలకు ప్రకటనైనా వెలువడలేదు కానీ, రాజకీయ పార్టీలు మాత్రం ఎత్తులకు పైఎత్తులు వేసుకుంటున్నాయి. ఎన్నికల ప్రకటనకు ముందే కాంగ్రెస్ పార్టీ చేతులెత్తేసినట్టు కనపడుతోంది. గతంలో హ్యాట్రిక్ విజయాలు సాధించిన ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ మాట్లాడుతూ, మరోసారి జరిగే ఎన్నికల్లో ఎవరికీ ఆధిక్యం రాని పక్షంలో తాము ఆప్ కి మద్దతు ఇస్తామని ప్రకటించారు. కాగా, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆమె ప్రతిపాదనను తిరస్కరించారు. 'ఆలూలేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం' అన్నట్టు ఎన్నికల ప్రకటన వెలువడకుండానే కాంగ్రెస్ పొత్తు ప్రతిపాదన చేయడంతో బీజీపీ విమర్శలు ఎక్కుపెట్టింది. ఆప్, కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయని తాము గతంలో ఆరోపించినది వాస్తవమని షీలా వ్యాఖ్యలు రుజువుచేస్తున్నాయంటూ ఆరోపిస్తున్నారు.

  • Loading...

More Telugu News