: పాకిస్థాన్ పార్లమెంట్ లో అత్యంత ధనవంతుడు ఎవరో తెలుసా?


పాకిస్థాన్ పార్లమెంటులో అత్యంత ధనవంతుడు ఎవరో తెలుసా? సాక్షాత్తూ ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫే! 200 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులతో ఆయన ఆ దేశ పార్లమెంటేరియన్లందరిలోకీ ధనవంతుడిగా కీర్తికెక్కారు. పాకిస్థాన్ ఎన్నికల కమిషన్ కి సమర్పించిన అఫిడవిట్లో నవాజ్ తన ఆస్తి వివరాలు పేర్కొన్నారు. కాగా, పాకిస్థాన్ ప్రతిపక్ష పార్టీ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ అధినేత, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ఆస్తులు కేవలం 3.3 కోట్లేనని పేర్కొన్నారు. కాగా, పాక్ లో లక్షలాది మంది ప్రజలు ఇంకా దారిద్ర్యరేఖ దిగువనే జీవనం సాగిస్తున్నారు.

  • Loading...

More Telugu News