: కాంగ్రెస్ కు రుద్రరాజు పద్మరాజు రాజీనామా
ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో రేపు టీడీపీలో చేరనున్నట్లు ఆయనే స్వయంగా ప్రకటించారు. యువజన విభాగం నుంచి పీసీసీ వరకు 30 ఏళ్ల పాటు పద్మరాజు కాంగ్రెస్ లో వివిధ హోదాల్లో పనిచేశారు. ప్రస్తుతం ఆయన రెండోసారి ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ తుడిచి పెట్టుకుపోవడంతో ప్రధాన నేతలు సహా ఎవరికీ గుర్తింపు లేకుండా పోయింది. మరోవైపు, కాంగ్రెస్ లో ఎంత కష్టపడినా గుర్తింపు లేదని పద్మరాజు ఇటీవల ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.