: టెర్రరిస్టుల చెరలో బందీగా మహిళ... టెర్రరిస్టులతో పోలీసుల సంప్రదింపులు


ఫ్రాన్స్ లోని పారిస్ లో ఓ పత్రికా కార్యాలయంపై విరుచుకుపడిన తీవ్రవాదులు అందులోని 12 మందిని పొట్టనబెట్టుకుని, మరో మహిళా పోలీసుని హతమార్చి, ఫ్రాన్స్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఓ కారును తస్కరించి పారిపోయేందుకు ప్రయత్నించిన ఉగ్రవాదులు ఎక్కడున్నారో పోలీసులు గుర్తుపట్టారు. పోలీసులను తప్పించుకునేందుకు ఓ ప్రింటింగ్ ప్రెస్ గోడౌన్ లో దాక్కున్న ఉగ్రవాదులు అక్కడ ఓ మహిళా ఉద్యోగిని అదుపులోకి తీసుకున్నారు. సంఘటనాస్థలిని పోలీసులు చుట్టుముట్టడంతో టెర్రరిస్టులు ఆమె ద్వారా వారితో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News