: భారతదేశంలో రికార్డు స్థాయి కనిష్ఠ ఉష్ణోగ్రత ఇదే
భారతదేశంలో ఈ ఏడాది అత్యల్ప ఉష్ణోగ్రత జమ్మూ కాశ్మీర్ లోని కార్గిల్ లో నమోదైంది. హిమాలయాలకు సమీపంలో ఉండే కార్గిల్ లో మైనస్ 17.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో కార్గిల్ గడ్డకట్టుకుపోయింది. ప్రతిఏటా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నప్పటికీ గత రాత్రి కార్గిల్ లో ఒక్కసారిగా మైనస్ 16.6 నుంచి మైనస్ 17.2 కు పడిపోయింది. దీంతో విపరీతమైన చలి, మంచుతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే లడఖ్ రీజియన్ లోని లేహ్ (లోయ) లో కూడా మైనస్ 16 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. వీస్తున్న అతి శీతల గాలులకు ప్రజలు వణికిపోతున్నారు.