: పారిస్ కాల్పుల్లో ఒకరి మృతి
పారిస్ లో తాజాగా జరుగుతున్న కాల్పుల్లో ఒకరు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. అనుమానిత ఉగ్రవాదులున్నారని భావిస్తున్న ఓ కారును పోలీసులు వెంబడిస్తుండగా ఈ కాల్పులు మొదలయ్యాయి. ఈ క్రమంలో దుండగులు సెన్ ఏ మార్నే ప్రాంతంలోని ఓ గోడౌన్ కు చెందిన కొందరు కార్మికులను బందీలుగా పట్టుకున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని భద్రతా దళాలు చుట్టుముట్టాయి. ఈ ఆపరేషన్లో హెలికాప్టర్లను కూడా వినియోగిస్తున్నారు.