: జాకీ చాన్ కుమారుడికి జైలు శిక్ష


మాదకద్రవ్యాల కేసులో ప్రముఖ యాక్షన్ హీరో జాకీ చాన్ కుమారుడు జైసీ చాన్ (32) కు ఆరు నెలల జైలు శిక్ష పడింది. మత్తుమందులు వాడుతున్న వారికి ఆశ్రయం ఇచ్చాడన్నది ఆయనపై ఉన్న ప్రధాన ఆరోపణ. గత ఆగస్టులో పోలీసులు ఆయన ఇంటిపై దాడి చేసినప్పుడు 100 గ్రాముల 'మరిజువాన' దొరికింది. తీర్పు ఇచ్చే ముందు తనను క్షమించాలని బీజింగ్ పరిధిలోని డాంగ్ చెంగ్ జిల్లా కోర్టు న్యాయమూర్తిని జైసీ చాన్ అభ్యర్థించాడు. కాగా, జైసీ చాన్ తో పాటు తైవాన్ నటుడు కై కో కూడా పోలీసులకు దొరికాడు. వీరిద్దరూ 'మరిజువాన' తీసుకున్నారని వైద్య పరీక్షల్లో తేలింది. కై కో ను 14 రోజుల కస్టడీ అనంతరం వదిలిపెట్టిన అధికారులు జైసీ చాన్ పై క్రిమినల్ కేసు పెట్టారు. జైసీ చాన్ కు 322 డాలర్ల (సుమారు రూ.20 వేలు) జరిమానాను కూడా కోర్టు విధించింది.

  • Loading...

More Telugu News