: ఆధారాలు లేకుండా విచారణ ఎలా చేస్తారు?: సీబీఐని ప్రశ్నించిన సుప్రీం


సంచలనాత్మక 2జీ స్కాంలో ప్రముఖ పారిశ్రామికవేత్తలకు ఊరట కలిగింది. విచారణలో భాగంగా సునీల్‌ మిట్టల్ సహా పలువురు పారిశ్రామికవేత్తలకు గతంలో అందిన నోటీసులు చెల్లవని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఆధారాలు లేకుండా విచారించడం సరికాదన్న కోర్టు, కచ్చితమైన ఆధారాలు లేకుండా విచారణ ఎలా చేస్తారని సీబీఐని ప్రశ్నించింది. ఆధారాలు ఉంటేనే ప్రముఖులను ప్రశ్నించాలని సీబీఐకు సూచించింది. 2013 మార్చిలో కేసు నమోదు కాగా, కేసు కొట్టివేయాలని సునీల్ మిట్టల్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News