: తీవ్రవాది లఖ్వీకి మరోసారి బెయిల్... అయినా జైల్లోనే!
ముంబయి పేలుళ్ల నిందితుడు, లష్కరే తోయిబా ప్రధాన నేత జకీయుర్ రెహ్మన్ లఖ్వీకి మరోసారి బెయిల్ మంజూరయింది. రూ.2 లక్షల పూచీకత్తుతో ఇస్లామాబాద్ కోర్టు బెయిల్ ఇచ్చింది. అయితే, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం జైల్లోనే ఉండకతప్పదు. గతేడాది డిసెంబర్ లో పాకిస్థాన్ లోని ఉగ్రవాద వ్యతిరేక కోర్టు ఇతనికి బెయిల్ ఇవ్వగా, భారత్ నిరసనల నేపథ్యంలో మళ్లీ అదుపులోకి తీసుకున్నారు. లఖ్వీపై కిడ్నాప్ కేసు నమోదు చేశారు. తాజాగా, పూచీకత్తుపై మళ్లీ బెయిల్ మంజూరు చేయడం గమనార్హం. అటు, తొలుత ఇచ్చిన బెయిల్ తీర్పుపై పాక్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీలు చేసిన సంగతి తెలిసిందే.