: డీఎంకే అధ్యక్షుడిగా కరుణానిధి... వరుసగా పదకొండోసారి ఎంపిక
ద్రవిడ మున్నేట్ర కళగం (డీఎంకే) పార్టీ అధ్యక్షుడిగా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మరోమారు ఎంపికయ్యారు. దీంతో, పార్టీ అధ్యక్షుడిగా ఆయన వరుసగా పదకొండోసారి ఎన్నికై రికార్డు సృష్టించారు. ఇప్పటికే పది పర్యాయాలు పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించిన ఆయన, ఈ దఫా ఆ బాధ్యతలను తన కుమారుడు, తమిళనాడు మాజీ డిప్యూటీ సీఎం స్టాలిన్ కు అప్పగిస్తారన్న ఊహాగానాలకు తెరదించుతూ తానే నామినేషన్ దాఖలు చేశారు. అధ్యక్షుడిగా ఆయనను పార్టీ కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకుంది.