: దావూద్ ఎక్కడున్నా చట్టం ముందు నిలబెడతాం: భారత్


అండర్ వరల్డ్ డాన్, మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు దావూద్ ఇబ్రహీంపై తమ వైఖరి మారలేదని భారత్ స్పష్టం చేసింది. అతడు ఎక్కడున్నా చట్టం ముందు నిలబెడతామని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ చెప్పారు. 1993 ముంబయి పేలుళ్ల ఘటనలో దావూద్ పాత్రను తాము మరిచిపోలేదని, అతను పరారీలో ఉన్న నిందితుడని పేర్కొన్నారు. ఏదో ఒకనాడు అతన్ని చట్టం ముందుకు తీసుకువస్తామని అన్నారు. దావూద్ పాకిస్థాన్ లోనే ఉన్నట్టు ఓ ఆడియో టేప్ ద్వారా స్పష్టమైన నేపథ్యంలో వైఖరి తెలపాలంటూ మీడియా అడిగిన ప్రశ్నకు అక్బరుద్దీన్ పైవిధంగా సమాధానమిచ్చారు. ఇక, ఇరాక్ లో ఆచూకీ లేకుండా పోయిన భారతీయుల కోసం కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. తామంతా ఈ అంశంపై శ్రమిస్తున్నామని అన్నారు. అయితే, వారి ప్రస్తుత పరిస్థితి గురించి కచ్చితమైన సమాచారం లేదని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News