: హన్మకొండ మురికివాడల్లో కేసీఆర్... సీఎం క్యాంప్ ఆఫీస్ ముందు పీడీఎస్ యూ


తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు కూడా వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. జిల్లాలో తన రెండో రోజు పర్యటనలో భాగంగా హన్మకొండలోని మురికివాడల్లో ఆయన పర్యటన కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఓ వైపు మురికివాడల్లోని సమస్యలపై ఆయన పరిశీలన చేస్తుంటే, హైదరాబాదులోని ఆయన క్యాంపు కార్యాలయాన్ని పీడీఎస్ యూ విద్యార్థులు ముట్టడించారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్ యూ సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించింది. ఈ సందర్భంగా క్యాంపు కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు విద్యార్థులు యత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు, పోలీసుల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి.

  • Loading...

More Telugu News