: పాన్ కొంటే కండోమ్ ఉచితం... మద్దతు పలికిన బీహార్ ప్రభుత్వం!


ఎయిడ్స్ వ్యాధిపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించేలా నందలాల్ అనే పాన్ వ్యాపారి చేపట్టిన ప్రచారానికి బీహార్ ప్రభుత్వం స్వయంగా మద్దతు పలికింది. కతిహార్ జిల్లా ఫాల్కాబజార్‌ లో పాన్‌ షాప్ నిర్వహిస్తున్న నందలాల్ తన వద్ద పాన్ కొనే ప్రతి ఒక్కరికీ ఒక కండోమ్ ను ఉచితంగా ఇస్తాడు. ప్రాణాంతక ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కల్పించడంతోపాటు, రోజురోజుకూ పెరిగిపోతున్న జనాభాకు అడ్డుకట్ట వేయడానికి తన వంతు ప్రయత్నంగా ఈ పని చేస్తున్నట్టు ఆయన చెబుతున్నారు. నందలాల్ రోజుకు సుమారు 75 వరకు కండోమ్ ప్యాకెట్లను ఉచితంగా పంచుతుంటాడు. మొదట్లో ఆర్థికంగా భారమనిపించినా, తరువాత ఓ ఎన్జీఓ సంస్థ ఆయనకు ఉచితంగా కండోమ్ ప్యాకెట్లను అందించింది. ఇప్పుడు బీహార్ ఆరోగ్యమంత్రిత్వశాఖ కూడా చేతులు కలిపింది. ఆయన చేపట్టిన ఈ వినూత్న ప్రచారానికి తమ ప్రభుత్వం తోడుగా ఉంటుందని ఆ శాఖ అధికారి పీకే సింగ్ వివరించారు.

  • Loading...

More Telugu News