: ఎయిర్ టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ పై కోర్టు నిర్ణయం ఎటో!
సంచలనం సృష్టించిన 2-జీ స్పెక్ట్రమ్ కేసులో భారతీ సెల్యూలర్ లిమిటెడ్ చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్, ఎస్సార్ గ్రూప్ ప్రమోటర్ రవి రూయాలను విచారించాలా? వద్దా? అనే విషయమై కోర్టు నేడు కీలక నిర్ణయం తీసుకోనుంది. వీరిద్దరూ నేడు హాజరుకావాలని ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది. కాగా, 2002లో జరిగిన కుంభకోణంపై విచారిస్తున్న సీబీఐ వీరిద్దరికీ వ్యతిరేకంగా సాక్ష్యాలు ఉన్నాయని కోర్టుకు తెలిపింది. 2013 మర్చిలోనే వీరిపై కేసు నమోదు కాగా, సరైన సాక్ష్యాలు లేవని, కేసు కొట్టివేయాలని సునీల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సునీల్ మిట్టల్ కు వ్యతిరేకంగా కోర్టు తీర్పు వచ్చినట్లయితే, ఆ వెంటనే ఆయన్ను ప్రశ్నించాలని సీబీఐ భావిస్తోంది.