: లంకలో ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం... హ్యాట్రిక్ దిశగా రాజపక్స!
శ్రీలంక అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. మరి కొన్ని గంటల్లో పూర్తి స్థాయి ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఇప్పటికే రెండు పర్యాయాలు అధ్యక్షుడిగా కొనసాగిన మహీంద రాజపక్స, వరుసగా మూడోసారి కూడా విజయం సాధిస్తానన్న ధీమాతో ఉన్నారు. అయితే ఈ ఎన్నికల్లో రాజపక్సకు నిరాశ తప్పదని ఆయన ప్రధాన ప్రత్యర్థి మైత్రిపాల సిరిసేన చెబుతున్నారు. మొత్తం 19 మంది అధ్యక్ష పదవి కోసం బరిలో నిలిచినా, ప్రధాన పోటీ మాత్రం రాజపక్స, సిరిసేనల మధ్యే నెలకొంది. అధ్యక్ష ఎన్నికల్లో దాదాపు 70 శాతం ఓట్లు పోలయ్యాయి. కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన కౌంటింగ్ శరవేగంగా సాగుతోంది.