: ఐటీ కేసులో జయకు స్వల్ప ఊరట... ఆదాయపన్ను శాఖ విచారణ ఉపసంహరణ


ఏఐఏడీఎంకే అధినేత్రి జయలలిత, సన్నిహితురాలు శశికళపై నాలుగు కేసుల్లో కొనసాగుతున్న ఆదాయపన్ను శాఖ విచారణ ముగిసింది. ఈ కేసుల్లో వారు చెల్లించాల్సిన కాంపౌండింగ్ ఫీజు కట్టడంతో విచారణను ఉపసంహరించుకున్నట్టు ఆదాయపన్ను శాఖ తుది ఉత్తర్వుల్లో తెలిపింది. ఈ మేరకు నేడు చెన్నై అదనపు చీఫ్ మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో జరిగిన విచారణకు జయ తరపున న్యాయవాది కరుప్పయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా, తమ క్లయింట్లు చెల్లించిన కాంపౌండింగ్ ఫీజును అంగీకరించినట్టు, విచారణను ఉపసంహరించుకున్నట్టు ఆదాయపన్ను శాఖ జారీ చేసిన ఉత్తర్వులను మెమో రూపంలో కోర్టుకు సమర్పించారు. మరోవైపు, కేసును వెనక్కి తీసుకునేందుకు ఓ పిటిషన్ వేసినట్టు ఆదాయపన్ను శాఖ తరపున వాదిస్తున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె.రామసామి వెల్లడించారు. గతేడాది డిసెంబరులో తమ వ్యక్తిగత పూచీకత్తు కింద జయలలిత, శశికళ, వారిద్దరూ భాగస్వాములుగా ఉన్న ఓ సంస్థ కాంపౌండింగ్ ఫీజు రూపంలో రూ.1.99 కోట్లు ఆదాయపన్ను శాఖకు చెల్లించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News