: అనంతపురం బస్సు ప్రమాదం... మడకశిర డిపో మేనేజర్ పై వేటు
మడకశిర డిపో బస్సు పెనుగొండ సమీపంలో లోయలో పడ్డ ఘటనకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. మడకశిర డిపో రీజనల్ మేనేజర్ తోపాటు ముగ్గురు ఆర్ అండ్ బీ అధికారులను సస్పెండ్ చేసినట్లు ఆంధ్రప్రదేశ్ రవాణ శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు నేటి మధ్యాహ్నం వెల్లడించారు. బెంగళూరులో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆయన పరామర్శించారు. ఈ ఘటనలో డ్రైవర్ నిర్లక్ష్యం ఉందని, రహదారులు సరిగాలేవని, బస్సు కండిషన్ బాగోలేదని ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. వాటిపై స్పందించిన ప్రభుత్వం ఉన్నతాధికారులపై వేటు వేసింది.