: శశిథరూర్ కు ఢిల్లీ పోలీసుల నోటీసు
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కు ఢిల్లీ పోలీసులు నోటీసు పంపారు. భార్య సునంద పుష్కర్ హత్య కేసుకు సంబంధించిన దర్యాప్తులో వీలైనంత త్వరగా పాల్గొనాలని అందులో తెలిపారు. సీఆర్ పీసీ సెక్షన్ 160 కింద థరూర్ ను ఈ కేసులో ప్రశ్నించనున్నారు. కాగా స్పాండిలైటిస్ కు చికిత్స తీసుకునేందుకు థరూర్ కేరళలోని ఆయుర్వేదిక్ క్లినిక్ లో చేరారు. రేపు ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. ఈ కేసులో తనను ఇరికించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని, ఇంత అకస్మాత్తుగా తమ నిర్ణయాన్ని ఎందుకు మార్చుకున్నారంటూ థరూర్ అడిగిన సంగతి తెలిసిందే.