: ఆందోళన చెందుతున్న టీఎస్ ప్రభుత్వానికి స్వల్ప ఊరట


రాష్ట్ర విభజన జరిగినా... ప్రభుత్వ ఆదాయానికి ఏమాత్రం ఢోకా ఉండదని తొలుత టీఎస్ ప్రభుత్వం భావించింది. అయితే, అంచనాలను తలకిందులు చేస్తూ, రాష్ట్ర ఆదాయం తిరోగమనం దిశలో పయనించింది. దీంతో, టీఎస్ ప్రభుత్వం ఆందోళనకు గురైంది. ఈ క్రమంలో, డిసెంబర్ నెలలో ఆదాయం కాస్త మెరుగు పడటం, ప్రభుత్వానికి ఆనందాన్ని కలిగిస్తోంది. అటూఇటుగా సుమారు రూ. 3 వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. వాణిజ్య పన్నుల ద్వారా రూ. 2,272 కోట్లు, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు రూ. 233 కోట్లు, మద్యం రూ. 205 కోట్లు, రవాణా రూ. 170 కోట్లు, పన్నేతర ఆదాయం రూ. 100 కోట్లు, గనుల ద్వారా రూ. 52 కోట్ల ఆదాయం సమకూరిందని అధికారులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో ఆదాయాన్ని మరింతగా పెంచుకునేందుకు కృషి చేస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News