: నేడు తొలిసారి ఏపీలో పర్యటించనున్న అమిత్ షా
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నేడు తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్నారు. నిన్న రాత్రి హైదరాబాద్ విచ్చేసిన అమిత్, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బలోపేతం కోసం పార్టీ ముఖ్యనేతలకు పలు సూచనలు చేశారు. ఈ రోజు కూడా సాయంత్రం వరకు తెలంగాణ రాష్ట్ర వ్యవహారాలపైనే ఆయన దృష్టి సారించనున్నారు. అనంతరం ఈ రాత్రి విజయవాడ చేరుకుంటారు. రేపు ఉదయం ఏపీకి చెందిన బీజేపీ ముఖ్య నేతలతో అమిత్ భేటీ అవుతారు. సాయంత్రం జిల్లాల అధ్యక్షులు, ఇన్ ఛార్జ్ లు, పరిశీలకులతో సమావేశమవుతారు. 2019 ఎన్నికలే లక్ష్యంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలన్న దానిపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. మరోవైపు, అమిత్ షాకు ఘన స్వాగతం పలికేందుకు విజయవాడలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి.