: తీరప్రాంత రక్షణకు మూడంచెల భద్రత: డీజీపీ రాముడు
తీరప్రాంత రక్షణకు మూడంచెల భద్రతను ఏర్పాటు చేయనున్నామని ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాముడు తెలిపారు. ప్రకాశం జిల్లాలో పర్యటించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మెరైన్ పోలీసు వ్యవస్థను పటిష్ఠం చేస్తామని అన్నారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా పోలీసుల పనితీరును మారుస్తామని ఆయన వివరించారు. తీరప్రాంతంపై పటిష్ఠ నిఘా అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు.