: రైల్వేలకే కాదు, తపాల శాఖకు కూడా ఆ శక్తి ఉంది: మోదీ
భారత రైల్వేల లాగే దేశ ఆర్థిక వ్యవస్థను నడిపించే శక్తి, భారత తపాల శాఖకు కూడా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఢిల్లీలో పోస్టాఫీసుల అనుసంధానంపై జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భవిష్యత్ లో ప్రభుత్వ సమాచారం చేరవేయడంలో తపాలశాఖ కీలక పాత్ర పోషించనుందని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ఉపాధ్యాయుడిలాగే పోస్టుమేన్ కు కూడా సమున్నత స్థానం కల్పించేందుకు కృషి చేస్తానని ఆయన వెల్లడించారు.