: భారత్ కు బంగ్లాదేశ్ మంచి మిత్రదేశం: మమతా బెనర్జీ
భారతదేశానికి బంగ్లాదేశ్ మంచి మిత్రదేశమని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. కోల్ కతాలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, బంగ్లాదేశ్ తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నామని అన్నారు. బంగ్లాదేశ్ మనకు ఆప్తమిత్రదేశమని ఆమె పేర్కొన్నారు. కాగా, ఫిబ్రవరి 19 నుంచి మూడు రోజులపాటు మమతా బెనర్జీ బంగ్లాదేశ్ లో పర్యటించనున్నారు. బంగ్లా కాందిశీకులకు తాము ఆశ్రయమిస్తామని మమత గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.