: బీజేపీలో చేరిన టీవీ 'ద్రౌపది'


ప్రైవేట్ చానళ్లు లేని రోజుల్లో దేశంలో అందరికీ దూరదర్శనే దిక్కు. అప్పట్లో ఆ చానల్లో ప్రసారమైన 'మహాభారత్' మెగా సీరియల్ ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందులో ద్రౌపది పాత్ర పోషించిన రూపా గంగూలీ ఆ తర్వాత సినిమాల్లో బాగా బిజీ అయింది. తెలుగులోనూ కొన్ని సినిమాలు చేసింది. తాజాగా రాజకీయ రంగప్రవేశం చేసిందీ బెంగాలీ భామ. హౌరాలో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సమక్షంలో బీజేపీలో చేరింది. జైట్లీ ఆమెను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. రూపా గంగూలీ కమర్షియల్ సినిమాల్లోనే కాకుండా, ఆర్ట్ చిత్రాల్లోనూ నటించింది. ఆమె మంచి గాయని కూడా. 'అబోషెషే' చిత్రానికి గాను ఉత్తమ గాయనిగా జాతీయ అవార్డు దక్కించుకోవడం విశేషం. వివాహిత అయిన ఆమెకు ఓ కుమారుడున్నాడు.

  • Loading...

More Telugu News