: సునంద హత్యకేసులో నన్ను ఇరికించాలని చూస్తున్నారు: శశి థరూర్
తన భార్య సునంద హత్య కేసులో తనను ఇరికించాలని పోలీసులు భావిస్తున్నట్టు అనుమానంగా ఉందని కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ అన్నారు. తన వద్ద గతంలో పనిచేసిన ఉద్యోగులను ఇందుకు ఉపయోగించుకుంటున్నారని ఆయన ఆరోపించారు. సునందది హత్యేనని నిర్ధారణకు వచ్చిన పోలీసులు కేసును తిరగదోడే పని మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. అవసరమైతే శశి థరూర్ ను కూడా ప్రశ్నిస్తామని ఢిల్లీ పోలీసు అధికారి చెప్పిన గంటల వ్యవధిలో 'నన్ను ఇరికించేందుకు చూస్తున్నారు' అంటూ శశి థరూర్ ఆరోపించడం గమనార్హం.