: చంద్రబాబుపై తిరగబడండి: టీటీడీపీ నేతలకు కోమటిరెడ్డి పిలుపు
నాగార్జున సాగర్ నుంచి తెలంగాణ జిల్లాల్లోని పొలాల రెండో పంటకు నీళ్ళు రాకుండా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అడ్డుకుంటున్నారని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. బాబు వైఖరికి వ్యతిరేకంగా తెలంగాణ టీడీపీ నేతలు తిరగబడాలని ఆయన పిలుపునిచ్చారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, సాగర్ ఎడమ కాలువ నుంచి నల్గొండ, ఖమ్మం జిల్లాల చెరువులను నింపైనా రెండో పంటకు నీళ్లు లభించేలా కేసీఆర్ దృష్టి సారించాలని కోరారు. స్వైన్ ఫ్లూతో ప్రజలు మరణిస్తుంటే, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కోమటిరెడ్డి విమర్శించారు.