: తన సినిమా పాటలను విడుదల చేసిన డేరా బాబా
డేరా సచ్ఛా సౌధా మతాధిపతి గుర్మీత్ రామ్ రహీం సింగ్ తాను ప్రధానపాత్రలో నటించిన 'ఎంఎస్ జీ-ద మెసెంజర్ ఆఫ్ గాడ్' సినిమా ఆడియో విడుదల చేశారు. ఢిల్లీలోని పీవీఆర్ ప్రియా థియేటర్లో మంగళవారం నాడు పాటల ఆవిష్కరణ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నటి ఫ్లోరా సైనీ, బాక్సర్ విజేందర్ కుమార్ తదితరులు హాజరయ్యారు. కాగా, ఈ చిత్రంలో 'నెవర్ ఎవర్', 'రామ్ రామ్', 'రాతాన్-బాతాన్', 'దారు కా గోలీ మారో', 'పాపా ద గ్రేట్' పాటలున్నాయి. కాగా, ప్రీ బుకింగ్ ల పరంగా ఈ సినిమా ఆడియో ఫ్లిప్ కార్ట్, అమెజాన్ వంటి ఆన్ లైన్ పోర్టళ్లలో రికార్డులను బ్రేక్ చేస్తోందట. దీనిపై డేరా బాబా మాట్లాడుతూ, ఆ ఘనత దేవుడిదేనని అన్నారు. ఈ పాటల ఆల్బం కోసం సోనీ మ్యూజిక్ సంస్థ చాలా కష్టపడిందని అన్నారు. అన్నట్టు... ఈ సినిమాకు సంగీతం, దర్శకత్వం, రచన డేరా బాబానే కావడం విశేషం.