: ఎయిర్ ఆసియా విమానం బ్లాక్ బాక్స్ ను కనుగొన్న రెస్క్యూ బృందం
సముద్రంలో కూలిపోయిన ఎయిర్ ఆసియా విమానం బ్లాక్ బాక్స్ ఉన్న పెద్ద శకలాన్ని గుర్తించినట్టు రెస్క్యూ అధికారులు తెలిపారు. విమానం తోక భాగంలో బ్లాక్ బాక్స్, విమానం డేటా రికార్డర్లు ఉంటాయని, ఇప్పుడు ఆ భాగం నుంచి వీటిని వెలికితీయడమే తమ తక్షణ కర్తవ్యమని ఇండోనేషియా నేషనల్ సెర్చ్ అండ్ రెస్క్యూ ఏజెన్సీ చీఫ్ బంబాంగ్ తెలిపారు. ఉపరితలానికి 28 మీటర్ల అడుగున తోక భాగం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో మడ్డి నీరు అధికంగా ఉండటంతో డైవర్లు స్పష్టంగా చూడలేకపోతున్నారని ఆయన తెలిపారు. ఈ విమాన ప్రమాదం జరిగి 11 రోజులు కాగా, ఇంతవరకూ 39 మృతదేహాలను వెలికితీశారు.