: నేను, రేఖ 'షమితాబ్'లో కలసి నటించడం లేదు: అమితాబ్


దర్శకుడు బాల్కీ రూపొందిస్తున్న 'షమితాబ్'లో తాను, రేఖ కలసి స్క్రీన్ స్పేస్ పంచుకోలేదని నటుడు అమితాబ్ బచ్చన్ తెలిపారు. తాజాగా ముంబయ్ లో ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ సందర్భంగా బిగ్ బి మాట్లాడుతూ, "వాస్తవానికి మేము కలసి నటించడం లేదు... సన్నివేశంలో భాగంగా మా పాత్రలు ఉంటాయి. సినిమా చూసినప్పుడు ఎలా చూపించారో మీరే అర్థం చేసుకుంటారు. అయితే ఈ చిత్రంలో గొప్ప నిష్ణాతులు ఉండటం చాలా గొప్ప విషయం" అని వివరించారు. తమ ఇద్దరి (బిగ్ బి, రేఖ)తో కలసి ఓ చిత్రం చేయాలని బాల్కీ ఎప్పుడూ చెబుతుంటాడని, ఒకవేళ మంచి స్క్రిప్టు ఏదైనా వస్తే ఎందుకు చేయమని అన్నారు. ఈ సినిమాలో హీరో ధనుష్, అక్షర హసన్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News