: ఎంసెట్ వివాదంలో జోక్యం చేసుకోలేను: వెంకయ్యనాయుడు


ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న ఎంసెట్ వివాదంపై తాను జోక్యం చేసుకోలేనని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. సమస్యను గవర్నర్ వద్దే పరిష్కరించుకుని ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఎంసెట్ వివాదాన్ని హోంమంత్రి దృష్టికి తీసుకువెళతానని చెప్పారు. వివాదం తలెత్తినప్పుడు గవర్నర్, కేంద్ర హోంమంత్రి జోక్యం చేసుకోవాల్సి ఉందన్నారు. ఇరురాష్ట్రాలు కోరినప్పుడు మాత్రమే కేంద్రం జోక్యం చేసుకుంటుందని వెంకయ్య తెలిపారు. ఎంసెట్ ప్రవేశ పరీక్ష మేము నిర్వహిస్తామంటే, మేమంటూ ఇరు రాష్ట్రాలు వాదులాడుకుంటున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News