: అనంతపురం జిల్లాలో లోయలో పడ్డ ఆర్టీసీ బస్సు... ఇరవై మంది మృతి!
నేటి ఉదయం అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. ఎపీ 28 జడ్ 1053 నెంబర్ గల పల్లెవెలుగు బస్సు లోయలో పడిన దుర్ఘటనలో 20 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో 20 మందికి గాయాలు అయ్యాయి. మడకశిర నుంచి పెనుగొండకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు మార్గమధ్యంలో అదుపుతప్పి లోయలోకి బోల్తా పడింది. బస్సులో మొత్తం 50 మంది వరకూ ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. ఘటనా స్థలికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. మృతి చెందిన వారిలో అత్యధికులు విద్యార్థులేనని తెలుస్తోంది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.