: ఆసీస్ వికెట్ల పతనం ప్రారంభం... స్మిత్ ఔట్!
భారత్-ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న చివరి, నాలుగో టెస్టు మ్యాచ్ లో రెండో రోజు ఆటలో ఆసీస్ నాలుగో వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 416 వద్ద కెప్టెన్ స్టీవెన్ స్మిత్ (117) ఉమేశ్ యాదవ్ బౌలింగ్ లో వృద్ధిమాన్ సాహా చేతికి చిక్కాడు. వాట్సన్ పెవిలియన్ చేరిన 16 పరుగులకే కెప్టెన్ కూడా ఔటవడంతో ఆసీస్ వికెట్ల పతనం మొదలైంది. కెప్టెన్ ఔటవడంతో షాన్ మార్ష్ (10)కు జో బర్న్ జతకలిశాడు. 116.2 ఓవర్లలో ఆసీస్ నాలుగు వికెట్లు కోల్పోయి 416 పరుగులు చేసింది.