: బెజవాడకు నేడు ఏపీ పాలనా యంత్రాంగం... వరుస భేటీలతో చంద్రబాబు బిజీబిజీ
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని ఏర్పాటు కానున్న తుళ్లూరు సమీపంలోని విజయవాడకు నేడు ఏపీ పాలన యంత్రాంగం తరలిపోనుంది. సీఎం నారా చంద్రబాబునాయుడు, మంత్రిమండలి, అన్ని శాఖల ఉన్నతాధికారులు విజయవాడకు తరలిపోనున్నారు. 2015-16 బడ్జెట్ సన్నాహక సమావేశాన్ని చంద్రబాబు నిర్వహించనున్నారు. కొత్త రాజధాని భూసేకరణ, రాజధాని నిర్మాణం, తాత్కాలిక రాజధాని సముదాయం నిర్మాణం తదితర అంశాలపైనా ఆయన దృష్టి సారించనున్నారు. అనంతరం జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో చంద్రబాబు సమావేశం నిర్వహిస్తారు. నేటి ఉదయం నుంచి సాయంత్రం దాకా పలు సమావేశాలతో చంద్రబాబు బిజీబిజీగా గడపనున్నారు.