: ఢిల్లీ ఓటర్లు 1,30,85,251
ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఆ రాష్ట్ర ఓటర్ల జాబితా విడుదల చేసింది. ఢిల్లీ మొత్తం ఓటర్ల సంఖ్య 1,30,85,251. కాగా అందులో పురుషుల సంఖ్య 72,60, 633. స్త్రీల సంఖ్య 58,24,618 మాత్రమే ఉంది. వీరిలో కొత్తగా ఓట్లు నమోదు చేయించుకున్న వారు 1,59,854 మంది ఉండగా, మొత్తం ఓటర్లలో 18 నుంచి 19 ఏళ్ల మధ్యనున్నవారు 1.72 లక్షల మందని ఎన్నికల కమిషన్ తెలిపింది. కాగా, ఢిల్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీ, ఆప్, కాంగ్రెస్ తదితర పార్టీలు సిద్ధమవుతున్నాయి.