: సునందది హత్యని ముందే తెలుసంటున్న దగ్గరి బంధువులు


కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ దివంగత భార్య సునంద పుష్కర్ ది హత్య అని తమకు ముందే తెలుసని ఆమె సమీప బంధువులు పేర్కొన్నారు. దీనిపై సునంద సమీప బంధువు అశోక్ కుమార్ అనే వ్యక్తి మాట్లాడుతూ, సునందను హత్య చేశారని తాము ముందునుంచీ భావిస్తున్నామని అన్నారు. అయితే, పోలీసులే ఆలస్యంగా నిర్ధారించారని ఆయన పేర్కొన్నారు. ఆమె మరణించిన సమయంలో శశిథరూర్ కేంద్ర మంత్రిగా ఉండడం వల్లే ఆమె హత్య విషయం వెల్లడికాకుండా అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు. కాగా, సునంద పుష్కర్ పై విషప్రయోగం జరిగిందని అప్పట్లో కథనాలు వెలువడ్డప్పటికీ వాటిని పోలీసులు ఖండించారు. ఇంకా దర్యాప్తు పూర్తి కాలేదని, వాస్తవాలు వెల్లడయ్యేవరకు ఓపిక వహించాలని పోలీసులు మీడియాకు సూచించిన సంగతి తెలిసిందే. తాజాగా పోలీసులు ఆమెపై విషప్రయోగం జరిగిందని నిర్ధారించారు.

  • Loading...

More Telugu News