: సునంద పుష్కర్ పై విషప్రయోగం పట్ల శశిథరూర్ ఆశ్చర్యం
సునందా పుష్కర్ పై విష ప్రయోగం జరిగిందని వైద్యులు నిర్ధారించడంపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన స్పందిస్తూ, "ఈ కేసును క్షణ్ణంగా దర్యాప్తు చేస్తారనుకుంటున్నా. పోలీసులకు నా పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇస్తున్నా. నా భార్య మరణం వెనుక కుట్ర ఉంటుందని మేమస్సలు అనుకోలేదు. ఇందులో సరైన దర్యాప్తు జరగాలని మేమంతా కోరుకుంటున్నాం. దాగిన కొన్ని నిజాలు బయటికి రావాల్సి ఉంది. ఇక పుష్కర్ మరణానికి సంబంధించిన సమాచారం తెలుసుకోవాలని నేను, తన కుటుంబ సభ్యులందరం కోరుకుంటున్నాం" అని థరూర్ అన్నారు.