: అసదుద్దీన్ వ్యాఖ్యలకు కారణం సంఘ్ పరివార్ 'ఘర్ వాపసీ': ప్రతిపక్షాలు


ప్రపంచంలోని ప్రజలంతా ముస్లింలేనంటూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఆయన వ్యాఖ్యలను కేంద్రంలోని ప్రతిపక్ష పార్టీలన్నీ ఖండించాయి. హిందూ, ముస్లిం ఛాందసవాదుల కారణంగా దేశానికి నష్టం వాటిల్లుతోందని ప్రతిపక్ష పార్టీలు అభిప్రాయపడ్డాయి. ఒవైసీని సంఘ్ పరివార్ చేపట్టిన 'ఘర్ వాపసీ' కార్యక్రమమే రెచ్చగొట్టిందని ప్రతిపక్షాలు పేర్కొన్నాయి. మిలాద్ ఉన్ నబీ పర్వదినం నాడు హైదరాబాదులో జరిగిన ఓ సభలో ఎంఐఎం అధినేత ఒవైసీ మాట్లాడుతూ, ప్రపంచంలోని ప్రజలంతా పుట్టుకతో ముస్లింలేనని, 'ఘర్ వాపసీ' కారణంగా మళ్లీ అంతా ఇస్లాంలోకి వస్తారని వ్యాఖ్యానించడం తెలిసిందే.

  • Loading...

More Telugu News