: 'వరల్డ్ కప్' జట్టులో రాయుడు... యువీకి మొండిచేయి


తెలుగుతేజం అంబటి రాయుడు వరల్డ్ కప్ లో పాల్గొనే టీమిండియాకు ఎంపికయ్యాడు. బీసీసీఐ సెలక్షన్ కమిటీ తుది జట్టును ప్రకటించింది. చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్ నేతృత్వంలో ముంబయిలో సమావేశమైన సెలక్షన్ కమిటీ తీవ్ర కసరత్తు అనంతరం 30 మంది ప్రాబబుల్స్ నుంచి తుది 15 మందిని ఎంపిక చేసింది. ఎలాంటి సంచలన నిర్ణయాలకు తావివ్వకుండా జట్టును ఎంపిక చేసినట్టు అర్థమవుతోంది. ఫిట్ నెస్ పై సందేహాలున్నా జడేజాను ఎంపిక చేయడమొక్కటే కాస్త ఆశ్చర్యపరిచే విషయం. జడేజా... ధోనీకి సన్నిహితుడున్న సంగతి తెలిసిందే. ఇక, యువరాజ్ విషయంలో సస్పెన్స్ వీడింది. జడేజాను తప్పిస్తే ఆ స్థానాన్ని యువరాజ్ తోనే భర్తీ చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ, సెలక్టర్లు మాత్రం జడ్డూవైపే మొగ్గుచూపారు. జట్టు సభ్యులు మహేంద్ర సింగ్ ధోనీ (కెప్టెన్/వికెట్ కీపర్), విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, అంబటి రాయుడు, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, సురేశ్ రైనా, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, అశ్విన్, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీ, స్టూవర్ట్ బిన్నీ, అక్షర్ పటేల్.

  • Loading...

More Telugu News