: పాఠశాలలకు ఫేస్ బుక్, ట్విట్టర్ ఖాతాలు తప్పనిసరి చేసిన యూపీ ప్రభుత్వం


తమ అనుబంధ పాఠశాలలన్నింటికీ ఫేస్‌ బుక్, ట్విట్టర్ ఖాతాలను తప్పనిసరి చేస్తూ ఉత్తరప్రదేశ్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. పాఠశాలలు చేపట్టే బోధనేతర కార్యక్రమాల వివరాలను ఎప్పటికప్పుడు ఆ ఖాతాల్లో పోస్టు చేయాలని సూచించింది. బోర్డు పరిధిలోని అన్ని ఎయిడెడ్, అన్ ఎయిడెడ్, ప్రభుత్వ పాఠశాలలతో పాటు, ఇంటర్మీడియట్ కళాశాలలు కూడా ఫేస్‌ బుక్, ట్విట్టర్ ఖాతాలు ప్రారంభించాలని పేర్కొంది. ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్, లక్నో, వారణాసి, ఆగ్రా, అలీఘడ్, గోరఖ్‌పూర్ ప్రాంతాల్లో బోర్డు పరిధిలో 600 వరకు పాఠశాలలు ఉండగా, అవన్నీ సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్లలో ఖాతాలను ప్రారంభించాలని సెకండరీ ఎడ్యుకేషన్ జాయింట్ డైరెక్టర్ రాజకుమారి వర్మ ఆదేశించారు.

  • Loading...

More Telugu News