: మహా వానరం కోసం మహా పురస్కారం
'పట్టిస్తే అయిదు కోట్లు' అనే ప్రకటన చూస్తే.. ఏదో కౌబాయ్ సినిమాలో హీరో కోసం రూపొందించిన పోస్టరులాగా మనకు అనిపిస్తుంది. కానీ.. ఇది ఒక రకం జీవి గురించి ఇచ్చిన ప్రకటన. ఉత్తర అమెరికాలోని భయంకరమైన అడవుల్లో బిగ్‌ఫుట్‌గా పిలిచే వానరజాతికి చెందిన జంతువులు ఉంటాయనేది చాలా విస్తృతంగా ప్రచారంలో ఉన్న విషయం. ఈ బిగ్‌ఫుట్ మహా వానరాలు మూడు మీటర్ల ఎత్తుతో.. 230 కిలోల బరువు వరకు ఉంటాయని అంతా చెప్పుకుంటూ ఉంటారు. అయితే నాగరిక సమాజంలో వీటిని రుజువులతో చూసిన వారు ఎవ్వరూ లేరు.
ఇప్పుడు పోటీ ఏమిటంటే.. ఈ బిగ్‌ఫుట్ వానరజాతికి చెందిన జంతువులను భయపెట్టకుండా, ఆయుధం ఉపయోగించకుండా, గాయపరచకుండా.. క్షేమంగా పట్టుకురావాలట. అలా పట్టుకువచ్చిన వారికి అయిదు కోట్ల రూపాయల బహుమతి దక్కుతుంది. అంతా బాగానే ఉంది.. వాషింగ్టన్‌కు చెందిన బీర్లు తయారు చేసే ఒలింపియా సంస్థ.. ఈ మహావానరం కోసం అయిదు కోట్ల రూపాయలు వెచ్చించి.. దొరికినా సరే.. ఏం చేసుకుంటుందా? అనేదే అసలు ప్రశ్న?