: ఆ విషయం గురించి జగన్ కు జ్యోతిష్కులు చెప్పలేదా?: పయ్యావుల


చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లే ఉంటుందని జ్యోతిష్కులు చెప్పారంటూ వైకాపా అధినేత జగన్ వ్యాఖ్యానించడంపై టీడీపీ నేత పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. రెండేళ్లలో జగన్ జైలుకి వెళతాడని జ్యోతిష్కులు చెప్పలేదా? అని మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వం రెండేళ్లు కాదు... మరో 20 ఏళ్లు ఉంటుందని అన్నారు. వైకాపా నుంచి ఒక్కో నేత చేజారుతుంటే... వారిని రక్షించుకోవడం కోసం జగన్ ఇలా మాట్లాడుతున్నారని చెప్పారు. రాజధాని పేరుతో ఏపీ ప్రభుత్వం రియలెస్టేట్ వ్యాపారం చేస్తోందన్న జగన్ ఆరోపణలకు సమాధానంగా... రియలెస్టేట్ వ్యాపారం చేసింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి అండ్ కో అని, దాని ఫలితంగానే జగన్ కేసులను ఎదుర్కొంటున్నారని ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News