: గాయపడిన అభిమానిని వెళ్లి కలుస్తా: ట్విట్టర్ లో పవన్


హైదరాబాదు శిల్పకళా వేదిక ఆవరణలో జరిగిన 'గోపాల గోపాల' ఆడియో కార్యక్రమంలో శ్రీనివాస్ అనే అభిమానిపై కొంతమంది యువకులు దాడి చేసి గొంతుకోసిన ఘటనపై నటుడు పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ మేరకు ట్విట్టర్ లో, "'గోపాల గోపాల' ఆడియో రిలీజ్ సమయంలో ఓ అభిమానిపై జరిగిన దాడి చాలా దురదృష్టకరం. నన్ను చాలా బాధించింది. అతను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవ్వగానే వ్యక్తిగతంగా వెళ్లి నేనే కలుస్తా. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా జాగ్రత్త పడాలి. మీ భద్రతే నాకు ప్రధానం" అని పవన్ ట్వీట్ చేశాడు.

  • Loading...

More Telugu News