: చంద్రబాబుతో నేవీ చీఫ్ భేటీ: తూర్పుతీరం వెంట భద్రతపై చర్చ
భారత నౌకా దళ ప్రధానాధికారి ఆర్ కే ధావన్ ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడితో కొద్దిసేపటి క్రితం భేటీ అయ్యారు. గుజరాత్ తీరంలో పాకిస్థానీ ఉగ్రవాదుల ఓడ పేలుడు, గణతంత్ర దినోత్సవ వేడుకల్లో దాడులు తప్పవన్న ఉగ్రవాదుల హెచ్చరికల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఏపీలోని తూర్పు తీరం వెంట భద్రత కోసం తీసుకుంటున్న చర్యలపైనే భేటీలో ప్రధానంగా చర్చ కొనసాగుతున్నట్లు సమాచారం. తూర్పుతీరం వెంట భద్రతతో పాటు జల రవాణా అంశంపై కూడా చంద్రబాబుతో నేవీ చీఫ్ చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.