: చేతబడి చేస్తున్నాడన్న నెపంతో సజీవదహనం
చేతబడి, వశీకరణ విద్యలను ప్రయోగిస్తున్నాడనే నెపంతో ఒక వ్యక్తిని సజీవ దహనం చేశారు. సభ్య సమాజానికి తలవంపులు తెచ్చే ఈ దారుణ ఘటన మహబూబ్ నగర్ జిల్లా కోడేరు మండలం రాజాపూర్ లో జరిగింది. రాములు (50) అనే వ్యక్తిపై అదే ఊరి గ్రామస్థులు కిరోసిన్ పోసి నిప్పంటించారు. ఇతను చేతబడి చేస్తున్నాడన్నది వారి ప్రధాన ఆరోపణ. ఈ ఘటనలో రాములు సజీవదహనమయ్యాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు.