: నిరుద్యోగులకు టోకరా ఇచ్చిన బుల్లితెర నటుడు


తాను నిర్మించే టీవీ సీరియల్ లో భాగస్వామిగా చేర్చుకుంటానంటూ, టీవీ ఆర్టిస్ట్ ఒకడు నిరుద్యోగులకు టోకరా వేశాడు. లక్షల్లో దండుకుని బెదిరింపులకు దిగుతున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అనేక టెలివిజన్ సీరియల్స్ లో నటించిన బొప్పన విష్ణువర్థన్ అనే నటుడు తానే హీరోగా కొత్త సీరియల్ నిర్మిస్తున్నానని ప్రచారం చేసుకున్నాడు. భాగస్వామిగా చేర్చుకుంటానని చెప్పి పలువురి వద్ద డబ్బులు వసూలు చేశాడు. సీరియల్ ఎంతకీ ప్రారంభం కాకపోవటంతో, ప్రసాద్ అనే వ్యక్తి తన డబ్బు తిరిగి ఇవ్వాలని కోరగా, తనకు పోలీసు ఉన్నతాధికారి తెలుసునంటూ విష్ణువర్థన్ బెదిరింపులకు దిగాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News