: అవును... బీబీసీ మాజీ యాంకర్ ను పెళ్లాడా: ఇమ్రాన్ ఖాన్


బీబీసీ మాజీ యాంకర్ రెహమ్ ఖాన్ ను వివాహం చేసుకున్నట్టు మాజీ క్రికెటర్, తెహ్రిక్ ఏ ఇన్సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ ధ్రువీకరించాడు. ఈ మేరకు లండన్ హీత్రూ విమానాశ్రయంలో విమానం ఎక్కేముందు విలేకరులతో మాట్లాడిన ఖాన్, "నా పెళ్లి గురించిన సంతోషకర విషయాన్ని దేశ ప్రజలతో పంచుకునేందుకు పాకిస్థాన్ వెళుతున్నా. నేను దాచడానికి ఏమీ లేదు" అని వెల్లడించాడు. కొన్ని రోజుల కిందట ఇమ్రాన్ రహస్యంగా వివాహం చేసుకున్నాడంటూ వచ్చిన వార్తలను ఆయన ఖండిచడం, ఇప్పుడు నిజమే అనడం ఆశ్చర్యం కలిగించే విషయం. 62 ఏళ్ల ఇమ్రాన్ కు 1995లో జెమీమా గోల్డ్ స్మిత్ తో తొలిసారి వివాహం జరిగింది. 2004లో భార్య నుంచి ఇమ్రాన్ విడిపోయాడు. తరువాత బీబీసీ వాతావరణ యాంకర్ గా పనిచేస్తూ, బ్రిటన్ లో ఉంటున్న 41 ఏళ్ల రెహమ్ తో పరిచయం ఏర్పడింది. ఆమెకు గతంలో పెళ్లయి, ముగ్గురు పిల్లలున్నారు. భర్తతో విడాకులు తీసుకుంది. అయినా రెహమ్ ను పెళ్లి చేసుకోవాలని ఇమ్రాన్ నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని ఓ సమయంలో మొదటి భార్యకు కూడా చెప్పాడు. అయితే ఆయన కుటుంబసభ్యులే వివాహంపై కొంత అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News