: సీఐడీకి అగ్రిగోల్డ్ కేసు బదిలీ!


అధిక వడ్డీల ఆశ చూపి అమాయకుల నుంచి కోట్లాది రూపాయలు దండుకున్న అగ్రిగోల్డ్ చిట్ ఫండ్ కేసు దర్యాప్తును సీఐడీ పోలీసులు చేపట్టనున్నారు. ప్రస్తుతం ఏలూరు సీసీఎస్ పోలీసుల ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు కొనసాగుతోంది. బాధితుల ఫిర్యాదు నేపథ్యంలో కేసు నమోదు చేసుకున్న ఏలూరు సీసీఎస్ పోలీసులు ఆది, సోమవారాల్లో విజయవాడలోని సంస్థ ప్రధాన కార్యాలయంతో పాటు సంస్థ యజమానులు రామారావు, కుమార్ ఇళ్లల్లోనూ సోదాలు నిర్వహించి పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. తాజాగా ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను సీఐడీకి అప్పగించాలని పోలీసు బాసులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఏలూరు సీసీఎస్ పోలీసులు కేసు దర్యాప్తును సీఐడీ పోలీసులకు అప్పగించనున్నారు. కేసు దర్యాప్తు బాధ్యతలు స్వీకరించేందుకు సీఐడీ పోలీసులు నేడు ఏలూరు వెళుతున్నారు. సోదాల్లో స్వాధీనం చేసుకున్న అన్ని ఆధారాలను సీసీఎస్ పోలీసులు సీఐడీ అధికారులకు అప్పగించనున్నారు.

  • Loading...

More Telugu News