: ఇదీ కేసీఆర్ వాగ్దానాల చిట్టా... విడుదల చేసిన షబ్బీర్ అలీ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో హామీలు, వాగ్దానాలు చేశారని... కానీ, వాటిలో చాలా వాగ్దానాలు కార్యరూపం కూడా దాల్చలేదని టీకాంగ్రెస్ నేత, మాజీ మంత్రి షబ్బీర్ అలీ విమర్శించారు. కేసీఆర్ కేవలం మాటల గారడీకే పరిమితమవుతున్నారని ఆరోపించారు. ఆ వాగ్దానాలను షబ్బీర్ అలీ విడుదల చేశారు. ఆ చిట్టాలో ఉన్న కొన్ని వాగ్దానాలు ఇవి. * హైదరాబాద్ ను సిలికాన్ వ్యాలీ మాదిరి ఐటి హబ్ గా చేయడం * నగరంలోని మిలటరీ స్థావరాల తరలింపు * హుస్సేన్ సాగర్ శుద్ధికి రూ. వంద కోట్ల కేటాయింపు * హుస్సేన్ సాగర్ చుట్టూ బహుళ అంతస్తుల భవనాలు, ఎలివేటెడ్ కారిడార్లు, స్కైవాక్ లు * వినాయక్ సాగర్ నిర్మాణం * హైదరాబాద్ ఉత్తరాన మరో విమానాశ్రయం * రవీంధ్రభారతి స్థానంలో కొత్త భవనం * హైదరాబాద్ రేస్ కోర్సు తరలింపు * చంచల్ గూడ జైలు తరలింపు * షాంఘై మాదిరి హార్డ్ వేర్ హబ్, టెక్నాలజీ డెవలప్ మెంట్ బ్యాంక్ * ప్రపంచలోనే పొడవైన టవర్ నిర్మాణం * యాదగిరి గుట్టను వాటికన్ సిటీ స్థాయికి తీసుకెళ్లడం * వరంగల్ ను సూరత్ స్థాయిలో టెక్స్ టైల్ హబ్ గా మార్చడం * లండన్, న్యూయార్క్ నగరాల మాదిరి కరీంనగర్ అభివృద్ధి * ఆదిలాబాద్ ను మరో కాశ్మీర్ చేయడం * ఫిలిం సిటీ నిర్మాణం * నాలుగు కొత్త జిల్లాల ఏర్పాటు.