: సింగరేణిలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి... కార్మికుల సమ్మె ఎఫెక్ట్!


దేశవ్యాప్తంగా బొగ్గు గని కార్మికులు చేపట్టిన సమ్మె కారణంగా సింగరేణిలో నేటి ఉదయం నుంచి బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. చర్చలు కొనసాగిద్దాం, సమ్మె విరమించండన్న కేంద్రం విజ్ఞప్తిని కార్మిక సంఘాలు తిరస్కరించాయి. ఈ నేపథ్యంలో, నేటి ఉదయం దేశవ్యాప్తంగా బొగ్గు గని కార్మికులు సమ్మె ప్రారంభించారు. బొగ్గు గనుల ప్రైవేటీకరణను నిరసిస్తూ కార్మిక సంఘాలు సమ్మె నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే. నేడు మొదలైన సమ్మె ఈ నెల 10 దాకా ఐదు రోజుల పాటు కొనసాగనుంది. సమ్మె నేపథ్యంలో సింగరేణిలోని తెలంగాణ కార్మిక సంఘం (టీబీజీకేఎస్) మినహా కార్మిక సంఘాలన్ని విధులు బహిష్కరించాయి. దీంతో సింగరేణి పరిధిలోని రామగుండం, బెల్లంపల్లి, మణుగూరు, ఇల్లందు, కొత్తగూడెం, మందమర్రి, శ్రీరాంపూర్, భూపాలపల్లి తదితర ప్రాంతాల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. సమ్మె కారణంగా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయిన నేపథ్యంలో సింగరేణికి భారీ నష్టం వాటిల్లే ప్రమాదముంది.

  • Loading...

More Telugu News